సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ సినిమా చేస్తున్నాడు.ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లోవచ్చిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ కావడంతో ‘భరత్ అను నేను’ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.అందులోను కొరిటాల శివ వరుస సక్సెస్ లతో ఉండడంతో సినిమాకి మరింతగా ప్లస్ కానుంది.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ డేట్ ని చిత్రయునిట్ అనౌన్స్ చేసింది. ‘భరత్ అను నేను’ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ నెల 31న రాత్రికి విడుదల చేయబోతున్నారుఅ అని అనౌన్స్ చేసారు.